Salman Khan: సల్మాన్ను బెదిరించింది ఓ మానసిక రోగి 10 d ago

బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్‌కు మరోసారి బెదిరింపులు వచ్చాయి. గుజరాత్ లోని వడోదరకు చెందిన 26 ఏళ్ల వ్యక్తి వర్లీ ట్రాన్స్‌పోర్ట్ డిపార్ట్‌మెంట్ కు వాట్సాప్ ద్వారా బెదిరింపు సందేశం పంపాడు. ఇంట్లోకి ప్రవేశించి కాల్పులు లేదా కారులో బాంబు పేలుస్తామని హెచ్చరించాడు. పోలీసులు వెంటనే స్పందించి విచారణ చేపట్టగా నిందితుడు మానసిక రోగిగా ఉన్నాడని వెల్లడించారు. గతంలోనూ సల్మాన్‌కు బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి బెదిరింపులు రాగ బాంద్రాలోని గెలాక్సీ అపార్ట్‌మెంట్ వద్ద కాల్పులు జరిపిన విషయం తెలిసిందే.